Payal: ఈ వారం థియేటర్స్ కి వస్తున్న సినిమాలివే!

  • ఈ నెల 17న చిన్న సినిమాల సందడి 
  • 'మంగళవారం'పై కనిపిస్తున్న బజ్ 
  • హన్సిక ప్రధాన పాత్రగా వస్తున్న 'మై నేమ్ ఈజ్ శ్రుతి'
  • అదే రోజున పలకరించనున్న 'స్పార్క్' .. 'అన్వేషి' 

New Movies Update

ఈ శుక్రవారం థియేటర్స్ కి ఓ నాలుగు సినిమాలు వస్తున్నాయి. బడ్జెట్ పరంగా .. తారాగణం పరంగా చూసుకుంటే ఓ మాదిరి బడ్జెట్ సినిమాలుగానే చెప్పుకోవాలి. ఈ నాలుగు సినిమాల్లో కాస్త బజ్ ఎక్కువగా ఉన్న సినిమాగా 'మంగళవారం' కనిపిస్తోంది. పాయల్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి అజయ్ భూపతి దర్శకత్వం వహించాడు. గ్రామీణ ప్రాంతంలోని రాజకీయాలు .. మూఢనమ్మకాలు .. అక్రమ సంబంధాలను టచ్ చేస్తూ సాగే కథ ఇది. ఇక అదే రోజున హన్సిక సినిమా ' మై నేమ్ ఈజ్ శ్రుతి' విడుదల కానుంది. ఆర్గాన్ మాఫియా చుట్టూ అల్లుకున్న సస్పెన్స్ థ్రిల్లర్ కథ ఇది. శ్రీనివాస్ ఓంకార్ దర్శకుడిగా వ్యవహరించాడు. ఆ తరువాత సినిమాగా 'స్పార్క్' గురించి చెప్పుకోవాలి. ఇది క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ. ఈ సినిమాతో విక్రాంత్ హీరోగా పరిచయమవుతున్నాడు. ఒక కథానాయికగా మెహ్రీన్ .. మరో నాయికగా రుక్సార్ థిల్లన్ అలరించనున్నారు. అదే రోజున 'అన్వేషి' కూడా థియేటర్లకు వస్తోంది. అనన్య నాగళ్ల - సిమ్రన్ గుప్తా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో హీరోగా విజయ్ ధరణ్ కనిపించనున్నాడు.

More Telugu News