Nagachaitanya: అమెజాన్ ప్రైమ్ కి 'దూత' .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే .!

  • విక్రమ్ కుమార్ నుంచి 'దూత' వెబ్ సిరీస్ 
  • హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ 
  • జర్నలిస్టుగా కనిపించనున్న చైతూ 
  • 8 ఎపిసోడ్స్ గా నడవనున్న ఫస్టు సీజన్
  • డిసెంబర్ 1 నుంచి ఐదు భాషల్లో స్ట్రీమింగ్  

Dhootha Web Series Streaming date confirmed

స్టార్ హీరోలు సైతం ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ ల దిశగా మొగ్గుచూపుతున్న సంగతి తెలిసిందే. అలాగే చైతూ కూడా వెబ్ సిరీస్ ల దిశగా మొదటి అడుగు వేశాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఆయన 'దూత' అనే వెబ్ సిరీస్ ను చేశాడు. కొంతకాలం క్రితమే ఈ సిరీస్ షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. 

అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ ను ఈ డిసెంబర్ 1వ తేదీ నుంచి ఐదు భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్టు చెబుతూ, కొంతసేపటి క్రితమే పోస్టర్ ను రిలీజ్ చేశారు. చైతూ చేసిన ఫస్టు వెబ్ సిరీస్ ఇది. హారర్ థ్రిల్లర్ జోనర్లో ఈ కథ నడుస్తుంది. రీసెంటుగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' సినిమా చేసిన చైతూ, ఆ వెంటనే ఆయన దర్శకత్వంలోనే వెబ్ సిరీస్ చేయడం విశేషం. 

చైతూ కథానాయకుడిగా నటించిన ఈ సిరీస్ లో పార్వతి తిరువోతు .. ప్రియా భవాని శంకర్ .. ప్రాచీ దేశాయ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. చైతూ జర్నలిస్టుగా కనిపించనున్న ఈ సిరీస్ లో సీజన్ 1లో భాగంగా 8 ఎపిసోడ్స్ ను వదలనున్నట్టు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి. 

More Telugu News