Budda Venkanna: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసిన తర్వాత జగన్ కు ఓటమి భయం పట్టుకుంది: బుద్దా వెంకన్న

Budda Venkanna fires on Jagan
  • సామాజిక బస్సు యాత్ర బుస్సు యాత్రగా మారిందన్న బుద్దా వెంకన్న
  • బీసీలను దగా చేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అని విమర్శ
  • జగన్ కు దమ్ము, ధైర్యం లేవని వ్యాఖ్య

వైసీపీ చేపట్టిన సామాజిక బస్సు యాత్రపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సెటైర్లు వేశారు. సామాజిక బస్సు యాత్ర బుస్సు యాత్రగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నందుకే యాత్రకు మూడు సార్లు బ్రేక్ వేశారని అన్నారు. బీసీలను దగా చేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అని... ఏ మొహం పెట్టుకుని సామాజిక యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. 33 మంది బీసీలను ఊచకోత కోయించి, కేసులు లేకుండా చేసినప్పుడు జగన్ కు బీసీలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. బీసీలకు అండగా ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. 

చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కలిసిన తర్వాత జగన్ కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. దమ్ము, ధైర్యం లేని పిరికిపంద జగన్ అని... అందుకే 10 నెలల క్రితం జరిగిన ఘటనలో బీటెక్ రవిని అరెస్ట్ చేయించారని విమర్శించారు. జగన్ జాతకం బాగోలేదు కాబట్టే చంద్రబాబు జోలికి వచ్చారని చెప్పారు.

  • Loading...

More Telugu News