Unstoppable: ఇది శాంపిల్ మాత్రమే.. రణబీర్ తో బాలయ్య 'అన్ స్టాపబుల్' పై 'ఆహా' అప్ డేట్

Aha confirms Balakrishna Unstoppable Talk Show with Ranbir Kapoor and Animal team
  • బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ టాక్ షో
  • లేటెస్ట్ ఎపిసోడ్ లో సందడి చేయనున్న యానిమల్ టీమ్
  • రణబీర్ కపూర్, రష్మిక, సందీప్ వంగాలతో బాలయ్య హంగామా
టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' కార్యక్రమానికి ఈసారి బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ విచ్చేస్తున్నాడు. దీనిపై ఇప్పటికే వార్తలు రాగా, అన్ స్టాపబుల్ షో ప్రసారదారు 'ఆహా' ఓటీటీ కూడా నిర్ధారించింది. ఈ మేరకు 'ఆహా' నుంచి అధికారికంగా అప్ డేట్ వచ్చింది. 

ప్రస్తుతం రణబీర్ కపూర్ యానిమల్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రణబీర్ సరసన రష్మిక మందన్న కథానాయిక. ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ క్రమంలో రణబీర్, రష్మిక, సందీప్ వంగా 'అన్ స్టాపబుల్' టాక్ షోలో బాలయ్యతో కలిసి సందడి చేశారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ఫొటోలను 'ఆహా' ఓటీటీ తన సోషల్ మీడియా అకౌంట్లో పంచుకుంది. 

"ఇది శాంపిల్ మాత్రమే. అసలు సిసలు షో ఇంకా ముందుంది మేరా దోస్త్! 'యానిమల్' చిత్రబృందంతో వైల్డెస్ట్ ఎంటర్టయిన్ మెంట్ కు సిద్ధంగా ఉండండి" అంటూ 'ఆహా' ఓటీటీ ట్వీట్ చేసింది. ప్రస్తుతం 'అన్ స్టాపబుల్' టాక్ షో మూడో సీజన్ నడుస్తోంది. రణబీర్, రష్మిక, సందీప్ వంగాలతో ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది.

Unstoppable
Balakrishna
Ranbir Kapoor
Rashmika Mandanna
Sandeep Vanga
Aha
Animal

More Telugu News