Assembly Rowdy: 'అసెంబ్లీ రౌడీ' వెనుక అలా జరిగింది: డైరెక్టర్ బి. గోపాల్

  • 'బొబ్బిలి రాజా' గురించి ప్రస్తావించిన గోపాల్ 
  • ఆ హిట్ వల్లనే 'అసెంబ్లీ రౌడీ' వచ్చిందన్న డైరెక్టర్ 
  • మోహన్ బాబు పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చారని వెల్లడి 
  • 44 రోజుల్లో షూటింగు పూర్తి చేశామని వివరణ  

B Gopal Interview

మోహన్ బాబు హీరోగా 1991లో వచ్చిన 'అసెంబ్లీ రౌడీ' సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమాను గురించి తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు బి.గోపాల్ ప్రస్తావించారు. 'దేవత' సినిమాకి నేను అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశాను. ఆ సమయంలోనే మోహన్ బాబుతో సాన్నిహిత్యం ఏర్పడింది. నేను పెద్ద డైరెక్టర్ ను అవుతానని అప్పుడే ఆయన చెప్పారు" అన్నారు. 


"నేను చేసిన 'బొబ్బిలి రాజా' హిట్ అయిన తరువాత ఆయన నాకు కాల్ చేసి, తన సినిమాకి డైరెక్టర్ గా చేయమని అడిగారు. తమిళంలో సత్యరాజ్ హీరోగా చేసిన సినిమాకి అది రీమేక్. ఆ సినిమా చూసిన తరువాత .. పరుచూరి గోపాలకృష్ణగారి అభిప్రాయం తీసుకుందామని అన్నాను. మోహన్ బాబు అలాగే చేశారు. ఆ సినిమా చేస్తే తెలుగులో తప్పకుండా హిట్ అవుతుందని గోపాలకృష్జ గారు అన్నారు.  

దాంతో 'అసెంబ్లీ రౌడీ' సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమా సెకండ్ వెర్షన్ ను గోపాలకృష్ణగారు ఒకటిన్నర రోజులో రాశారు. అక్షరం మార్చకుండా ఆ సినిమాను తీయడం జరిగింది. 44 రోజుల్లో ఆ సినిమా షూటింగును పూర్తిచేశాము. నా కెరియర్లో  చాలా తక్కువ రోజుల్లో షూట్ చేసిన సినిమా ఇదే" అని చెప్పారు గోపాల్.

More Telugu News