Viral Videos: నిండా పదేళ్లు లేని పిల్లాడి రాజకీయ అవగాహనకు రాజాసింగ్ ఫిదా.. ఈ వీడియో చూస్తే మీరూ అవాక్కవుతారు!

I wood like to meet my young friend says Raja Singh

  • సోషల్ మీడియాను దున్నేస్తున్న వీడియో
  • రీ ట్వీట్ చేస్తూ ఆ చిన్నారి ఫ్రెండ్‌ను కలుస్తానన్న రాజాసింగ్
  • చిన్నారి మాటలకు ప్రతి ఒక్కరు ఫిదా

వివాదాలతో సావాసం చేసే రాజకీయ నాయకుల్లో తెలంగాణ బీజేపీ నేత రాజాసింగ్ ముందువరుసలో ఉంటారు. కరుడుగట్టిన హిందుత్వవాదిగా పేరు తెచ్చుకున్న ఆయన మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల వేళ సస్పెన్షన్‌ను ఎత్తివేసిన అధిష్ఠానం గోషామహల్ టికెట్‌ను తిరిగి ఆయనకే కేటాయించింది.


రాజాసింగ్‌కు సంబంధించి తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో ప్రకారం..  ఎన్నికల నేపథ్యంలో జర్నలిస్ట్ తులసి చందు తన యూట్యూబ్ చానల్ కోసం గోషామహల్ ప్రాంతంలో పలువురిని ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా కూరగాయలు విక్రయించే ఓ ముస్లిం వ్యక్తిని సమీపించి.. ఈ ప్రాంతంలో ‘బెస్ట్ పొలిటికల్ లీడర్ ఎవరు?’ అని ప్రశ్నించారు. 


దానికి ఆయన సమాధానం వెతుక్కుంటుండగా అటువైపుగా వెళ్తున్న నిండా పదేళ్లు కూడా లేని ఓ పిల్లాడు.. ‘రాజాసింగ్’ అని బదులిచ్చాడు. వెంటనే అటువైపు తిరిగిన ఆమె.. కుర్రాడిని దగ్గరికి తీసుకుని ‘ఎందుకు?’ అని ప్రశ్నించారు. ఆ కుర్రాడు భుజాలెగరేస్తూ.. ‘రాజాసింగ్ అఖండ్ హిందూ’ అని సమాధానమిచ్చాడు. అంటే? అని ప్రశ్నిస్తే.. అతడు రాముడి భక్తుడు అని ఆ చిన్నారి బదులివ్వడంతో తులసి ఆశ్చర్యపోయారు. 


వైరల్ అయిన ఈ వీడియోను రీట్వీట్ చేసిన రాజాసింగ్.. ఆ చిన్నారి ఫ్రెండ్‌ను తప్పకుండా కలుసుకుంటానని పేర్కొన్నారు.

Viral Videos
Raja Singh
BJP
Goshamahal
Tulasi Chandu
  • Loading...

More Telugu News