Indian Origin family: దీపావళి సందర్భంగా అగ్నిప్రమాదం..లండన్‌‌లో భారత సంతతి కుటుంబం ఆహుతి

Five members of Indian Origin family die in house fire accident in west london during diwali celebrations
  • పశ్చిమ లండన్‌లోని ఓ ఇంట్లో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం
  • అగ్ని కీలల్లో పడి ఆరుగురి మృతి, మరొకరికి గాయాలు
  • ముగ్గురు చిన్నారులు సహా మొత్తం ఐదుగురు మృతులది ఒకే కుటుంబమని పోలీసుల గుర్తింపు
  • అగ్నిప్రమాదానికి బాణసంచా పేలుడు కారణమో కాదో ఇప్పుడే చెప్పలేమన్న అధికారులు
పశ్చిమ లండన్‌లోని దీపావళి సందర్భంగా ఓ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వీరిలో భారత సంతతికి చెందిన ఐదుగురు వున్నారు. వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఆదివారం రాత్రి ఆ కుటుంబం దీపావళి పండుగ జరుపుకుంటుండగా ఈ ప్రమాదం సంభవించిందని మెట్రోపాలిటన్ పోలీసులు సోమవారం తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన ఆరో వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదు. ప్రమాదంలో గాయాలపాలైన మరో వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఆయనకు ప్రాణాపాయం లేదని స్పష్టం చేశారు. 

టపాసులు కాల్చడమే ఈ ప్రమాదానికి కారణమా అన్న ప్రశ్నకు పోలీస్ చీఫ్ సూపరింటెండెంట్ ఇప్పుడే ఏమీ చెప్పలేమని తెలిపారు. ‘‘ఈ విషయమై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది’’ అని వెల్లడించారు. అగ్నిప్రమాదానికి సంబంధించి స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఓ వ్యక్తి ప్రమాదం నుంచి బయటపడి ఆసుపత్రికి చేరుకోగా, ఇంట్లో ఆరుగురి మృత దేహాలు కనిపించాయని పోలీసులు వెల్లడించారు. మరణించిన వారిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని గుర్తించారు. వారి వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఇక ఆరో వ్యక్తి ఎవరనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన వెనక కారణాలు తెలుసుకునేందుకు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు.
Indian Origin family
London
Fire Accident

More Telugu News