KCR: షర్మిల అందుకే పగబట్టారట... ఆమె డబ్బు సంచులను గెలిపిద్దామా?: కేసీఆర్

  • సమైక్యవాదులు రాజ్యం చేస్తామంటే నర్సంపేట వారు నిరసన తెలిపారన్న కేసీఆర్
  • పరాయి రాష్ట్రం వాళ్లు వచ్చి మనల్ని ఓడిస్తమంటే మనం ఓడిపోదామా? అని ప్రశ్న 
  • సుదర్శన్ రెడ్డిని గెలిపించాలన్న ముఖ్యమంత్రి
KCR comments on ys sharmila

నర్సంపేటకు ఓ ప్రత్యేకత ఉందని, సమైక్యవాదులు... వాళ్ల చెంచాలు రాజ్యం చేస్తామంటే ఇక్కడ నిరసన తెలిపారని, దీంతో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పగపట్టారట... డబ్బు కట్టలు పంపిస్తుందట.. మరి వైఎస్ షర్మిల డబ్బు కట్టలు గెలవాలా? మిషన్‌ భగీరథ నీళ్లు గెలవాలా? 24 గంటల కరెంటు గెలవాలా?.. అందరూ ఆలోచించాలని సీఎం కేసీఆర్ అన్నారు. నర్సంపేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పరాయి రాష్ట్రం వాళ్లు వచ్చి డబ్బు సంచులు పంచి మనల్ని ఓడిస్తమంటే మనం ఓడిపోదామా? దయచేసి ఆలోచించాలన్నారు.

వ్యవసాయం, రైతులు బాగుండాలని శపథం తీసుకున్నామని, అందుకే భూమండలంలో లేని రైతుబంధును తీసుకు వచ్చామన్నారు. 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నామన్నారు. పండిన పంటలను ప్రభుత్వమే రాష్ట్రవ్యాప్తంగా 7500 కొనుగోలు కేంద్రాలను పెట్టి కొనుగోలు చేస్తోందన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు రైతుబంధు దుబారా అంటున్నారని ధ్వజమెత్తారు. రైతు బంధును తాము రూ.10వేల నుంచి క్రమంగా రూ.16వేలకు పెంచుతామన్నారు. కాంగ్రెస్ పార్టీకి కృష్ణా, గోదావరి నదులు ఉన్నా నీళ్లు ఇవ్వ చేతకాలేదన్నారు. 50 ఏళ్లు పాలించి చేసిందేమిటన్నారు. చేనేత కార్మికులను ఆదుకోలేదని, రైతులకు మద్దతు ఇవ్వలేదన్నారు. 

నర్సంపేట బీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్‌కు రానే రాడని, వచ్చినా కారు అక్కడ ఆగదన్నారు. తెల్లారేసరికి నర్సంపేటలో ఉంటాడన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటాడన్నారు. అలాంటి సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాలన్నారు. కానీ టూరిస్ట్‌లా అయిదేళ్లకోసారి వచ్చే వారు మనకు వద్దన్నారు. ఈ నెల 30న బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని సూచించారు. గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే బీఆర్ఎస్‌కు ఈసారి పెరుగుతాయన్నారు. సుదర్శన్ రెడ్డిని గెలిపిద్దామని, రింగ్ రోడ్డు కావాలని చెబుతున్నాడని, అది చేద్దామన్నారు. సుదర్శన్ రెడ్డిని గెలిపిస్తే ఎన్నికల తర్వాత నర్సంపేటకు వచ్చి ఒక రోజంతా మీ మధ్యనే ఉంటానని, కావాల్సిన పనులన్నీ చేసిపెడతానన్నారు.

  • Loading...

More Telugu News