Team India: ప్రపంచకప్‌లో ఆ ఘనత సాధించిన తొలి జట్టుగా భారత్ నయా రికార్డ్

  • రౌండ్ రాబిన్ దశలో అన్ని గేముల్లో విజయం సాధించిన ఏకైక జట్టుగా భారత్
  • గతంలో శ్రీలంక, ఆస్ట్రేలియా 8 చొప్పున మ్యాచుల్లో విజయం
  • టోర్నీలో అజేయంగా నిలిచిన రెండు జట్లకు మాత్రమే ప్రపంచకప్
India become first team to go unbeaten in World Cup league format

ప్రపంచకప్‌లో భాగంగా నిన్న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 160 పరుగుల తేడాతో విజయం సాధించిన భారతజట్టు లీగ్ దశలో అన్ని మ్యాచుల్లోనూ గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ విజయంతో మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచకప్ రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో అపజయమన్నదే ఎరుగని ఏకైక జట్టుగా తన పేరును రికార్డు పుస్తకాల్లో లిఖించుకుంది. ఈ నెల 15న (బుధవారం) న్యూజిలాండ్‌తో సెమీస్‌లో తలపడనుంది. 

ఈ ప్రపంచకప్‌లో లీగ్ దశలో ఆడిన 9 మ్యాచుల్లోనూ టీమిండియా విజయం సాధించింది. ఇప్పటి వరకు మరే జట్టు ఈ ఘనత సాధించలేదు. 1996లో శ్రీలంక, 2003లో ఆస్ట్రేలియా ఎనిమిదేసి మ్యాచుల్లో విజయం సాధించాయి. టోర్నీలో అజేయంగా నిలిచిన రెండు జట్లు మాత్రమే ఇప్పటి వరకు ప్రపంచకప్ సాధించాయి. 1975, 79లో వెస్టిండీస్, 2003, 2007లో ఈ ఘనత అందుకున్నాయి. ఇప్పుడు భారత్ కనుక ప్రపంచకప్ గెలిస్తే అది మరో చరిత్ర అవుతుంది.

More Telugu News