Ambati Arjun: బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్జున్ కు బంపర్ చాన్స్ ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు

Buchibabu gives super chance for Bigg Boss contestant Ambati Arjun in Ram Charan movie
  • కొనసాగుతున్న బిగ్ బాస్ 7వ సీజన్
  • దీపావళి సందర్భంగా బిగ్ బాస్ వేదికపైకి కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్
  • అంబటి అర్జున్ కోసం వచ్చిన ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు
  • రామ్ చరణ్ సినిమాలో నీకు సూపర్ క్యారెక్టర్ అంటూ అర్జున్ కు ప్రామిస్
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో 7వ సీజన్ లోనూ ఉత్సాహభరితంగా నడుస్తోంది. దీపావళి సందర్భంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులను సంతోష పెట్టేందుకు ప్రతి కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్ తో పాటు ఒక ఫ్రెండ్ ను కూడా స్టేజ్ పైకి తీసుకువచ్చారు. 

ఈ క్రమంలో బిగ్ బాస్ ఇంట్లో ఉన్న టీవీ నటుడు అంబటి అర్జున్ కోసం దర్శకుడు సానా బుచ్చిబాబు స్టేజ్ పైకి వచ్చారు. ఈ సందర్భంగా అర్జున్ కు బంపర్ చాన్స్ ఇచ్చారు. ప్రస్తుతం సానా బుచ్చిబాబు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఓ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అంబటి అర్జున్ కు అవకాశం ఇస్తానని బిగ్ బాస్ వేదిక పైనుంచి బుచ్చిబాబు మాటిచ్చారు. నీది సూపర్ క్యారెక్టర్... రామ్ చరణ్ గారి కొత్త సినిమాలో ఫిక్స్ అయిపో అంటూ బంగారం లాంటి కబురు వినిపించారు. 

బుచ్చిబాబు ప్రామిస్ తో అంబటి అర్జున్ ముఖంలో కాంతులు నిండాయి. థాంక్యూ బుచ్చెన్నా అంటూ కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను అంబటి అర్జున్ టీమ్ పంచుకుంది.
Ambati Arjun
Buchibabu
Movie Chance
Ram Charan
Bigg Boss-7

More Telugu News