ఏపీ మంత్రి బొత్సకు బైపాస్ సర్జరీ
- ఈ నెల 6న విశాఖలో సాధారణ వైద్య పరీక్షలు
- గుండె రక్తనాళాల్లో మూడు చోట్ల పూడికలు గుర్తింపు
- హైదరాబాద్ లో చికిత్స.. నిలకడగా మంత్రి ఆరోగ్యం
హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంత్రి బొత్స సత్యనారాయణను చేర్పించగా.. శనివారం వైద్యులు ఆయనకు ఆపరేషన్ చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఈ సర్జరీ జరిగింది. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని, బొత్స సత్యనారాయణ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. నెల రోజుల వరకు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు మంత్రి బొత్స కుటుంబ సభ్యులు తెలిపారు.