Nagarkurnool District: అచ్చంపేటలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు అస్వస్థత

congress brs leaders to stone pelting mla balaraju injured
  • డబ్బు సంచులు తరలిస్తున్నారనే అనుమానంతో ఓ వాహనానికి అడ్డుపడ్డ కాంగ్రెస్ వర్గాలు
  •  అంబేద్కర్ నగర కూడలి వద్ద ఉద్రిక్తత 
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్న వైనం
  • ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు స్వల్ప గాయాలు, హైదరాబాద్‌కు తరలింపు 
డబ్బు సంచులు తరలిస్తున్నారనే అనుమానంతో కాంగ్రెస్ నాయకులు శనివారం రాత్రి ఓ వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడం అచ్చంపేటలో ఉద్రిక్తతలకు దారి తీసింది. తొలుత వాహనాన్ని కాంగ్రెస్ నాయకులు వెల్టూర్ గేటు వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తరువాత కారును వెంబడించి అంబేద్కర్ కూడలి వద్ద వాహనంపై రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వారిని చెదరగొట్టారు. 

విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ తలెత్తింది. ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. వాహనంపై దాడిని ఖండిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. కాంగ్రెస్ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, ఎమ్మెల్యే బాలరాజుకు అచ్చంపేటలో ప్రాథమిక చికిత్స అందించాక, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఇదిలా ఉంటే, బీఆర్‌ఎస్‌కు పోలీసులు సహకరిస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నిరసనకు దిగారు. 


Nagarkurnool District
BRS
Congress

More Telugu News