Royal Enfield: రాయల్ ఎన్ ఫీల్డ్ అమ్మకాల జోరు

Royal Enfield registers record level sales
  • సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికం
  • 2,29,496 బైకులు విక్రయించిన రాయల్ ఎన్ ఫీల్డ్
  • గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే ఈసారి 13 శాతం వృద్ధి
ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం రాయల్ ఎన్ ఫీల్డ్ అమ్మకాల జోరు ప్రదర్శించింది. గడచిన త్రైమాసికంలో భారీగా అమ్మకాలు సాగించింది. ఈ త్రైమాసికంలో రాయల్ ఎన్ ఫీల్డ్ 2,29,496 మోటార్ సైకిళ్లను విక్రయించింది. గతేడాది సెప్టెంబరు త్రైమాసికంతో పోల్చితే ఈ ఏడాది రాయల్ ఎన్ ఫీల్డ్ అమ్మకాలు 13 శాతం పెరిగాయి. 

రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ ఆగస్టులో 77,583 మోటార్ సైకిళ్లను విక్రయించగా, సెప్టెంబరులో 78,580 మోటార్ సైకిళ్లను విక్రయించింది. రాయల్ ఎన్ ఫీల్డ్ తన క్లాసిక్ 350 బైకును ఆధునికీకరించి కొత్త వెర్షన్ ను మార్కెట్లోకి తీసుకురావడం బాగా కలిసొచ్చింది. ఈ మోడలే అత్యధిక అమ్మకాలు నమోదు చేసింది. దీని తర్వాత స్థానంలో మెటియోర్ 350, హంటర్ బైకులు నిలిచాయి.
Royal Enfield
Sales
Quarter
Bikes
India

More Telugu News