Venkat Akkineni: ఎన్టీఆర్ .. ఏఎన్నార్ ఎలా ఉండేవారో నాకు తెలుసు: వెంకట్ అక్కినేని

Venkat Akkineni Interview
  • ఎన్టీఆర్ ను ఏఎన్నార్ తరచూ కలిసేవారన్న వెంకట్ అక్కినేని 
  • ఇద్దరూ తమ జర్నీని గురించి ముచ్చటించుకునేవారని వెల్లడి
  • ఎన్టీఆర్ తో కలిసి ఏఎన్నార్ అక్కడే భోజనం చేసేవారని వివరణ 
  •  కబుర్లలో వాళ్లకి సమయం తెలిసేది కాదని వ్యాఖ్య   

ఎన్టీఆర్ - ఏఎన్నార్ మధ్య ఒకానొక సందర్భంలో మనస్పర్థలు వచ్చిన సంగతి విదితమే. తాజా ఇంటర్వ్యూలో వెంకట్ అక్కినేని దగ్గర ఆ ప్రస్తావన వచ్చింది. అందుకు ఆయన స్పందిస్తూ .. "ఎన్టీఆర్ - ఏఎన్నార్ గురించి మంచి మాట్లాడుకుందాం .. వాళ్లిద్దరూ ఎంత స్నేహంగా ఉండేవారో నాకు తెలుసు. ప్రత్యక్షంగా చూసినవాడిని నేను" అని అన్నారు. 

"ఎన్టీఆర్ మా ఇంటికి వచ్చేవారు .. మా అమ్మగారి చేతివంట అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా మా ఇంటికి వచ్చి, తనకి ఎంతో ఇష్టమైన పాయసం చేయించుకుని తినేవారు. ఎన్టీఆర్ చివరి మూడేళ్లలో మా నాన్నగారు ప్రతి నెలలో ఒకసారి ఆయనను కలిసేవారు .. అక్కడే భోజనం చేసేవారు" అని చెప్పారు. 

"ఒకసారి నాన్నగారితో కలిసి నేను కూడా ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్లాను. వాళ్లిద్దరూ తమ జర్నీని గురించిన విషయాలను ఎంతో సరదాగా చెప్పుకోవడం విన్నాను. రెండు మూడు గంటల పాటు వాళ్లిద్దరే అలా మాట్లాడుకుంటూ కూర్చునేవారు. ఎన్టీఆర్ గారు పోయినప్పుడు నాన్నగారు ఎంత బాధపడ్డారో చూసినవాడిని నేను" అని అన్నారు. 


Venkat Akkineni
Ntr
ANR

More Telugu News