Chandramohan: తొలి సినిమాతోనే అవార్డు పొందిన చంద్రమోహన్

  • కథానాయకుడిగా 175 సినిమాలు
  • మొత్తం 932 సినిమాల్లో నటించిన చంద్రమోహన్
  • కుర్ర హీరోలకు తండ్రి పాత్రల్లో మెప్పించిన నటుడు
ChandraMohan Got Nandi Award For His First Movie

చంద్రమోహన్ గా తెలుగు తెరకు పరిచయమైన ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు.. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న ఆయన జన్మించారు. 1966లో రంగులరాట్నం సినిమాతో అరంగేట్రం చేశారు. తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్నారు. పదహారేళ్ల వయసు సినిమాలో నటనకు ఆయనను ఫిల్మ్ ఫేర్ అవార్డు వరించింది. మొత్తంగా రెండు ఫిలింఫేర్‌, 6 నంది అవార్డులను ఆయన అందుకున్నారు.

తన కెరీర్ లో 932 సినిమాలు చేసిన చంద్రమోహన్.. అందులో హీరోగా 175 సినిమాలు చేశారు. తర్వాతి కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించారు. కమెడియన్ గా ప్రేక్షకులను నవ్వించారు. కుర్ర హీరోలకు తండ్రి పాత్రల్లో నటించి కొత్తతరాన్నీ ఆకట్టుకున్నారు.

More Telugu News