Hyderabad: పరేడ్ గ్రౌండ్ వైపు వెళ్తున్నారా.. మరి ట్రాఫిక్ ఆంక్షలున్నాయి.. చూసుకోండి!

  • మోదీ సభ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపులు
  • మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 వరకు ఆంక్షలు
  • ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసుల విజ్ఞప్తి
Traffic Diversion In Secunderabad due to modi sabha

పరేడ్ గ్రౌండ్స లో ప్రధాని నరేంద్ర మోదీ సభ కారణంగా శనివారం సికింద్రాబాద్ చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని చెప్పారు. వాహనదారులు సహకరించాలని కోరారు. ట్రాఫిక్ మళ్లింపులకు సంబంధించిన వివరాలను పోలీసులు శుక్రవారమే విడుదల చేశారు. ఆంక్షల కారణంగా సంగీత్, వైఎంసీఏ, ప్యాట్నీ, ప్లాజా, సీటీవో, చిలుకలగూడ క్రాస్ రోడ్స్, ఆలుగడ్డ బావి, బ్రూక్ బాండ్, టివోలీ తదితర ఏరియాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. ప్రత్యామ్నాయ రూట్ లలో ప్రయాణించాలంటూ వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

  • టివోలి క్రాస్ రోడ్ నుంచి ప్లాజా క్రాస్ రోడ్ వెళ్లే రూట్ లో వాహనాలను అనుమతించరు. ఎంజీ రోడ్, ఆర్పీ రోడ్, ఎస్డీ రోడ్ లు క్లోజ్ చేస్తారు.
  • పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రూట్ లో వాహనాల రద్దీ పెరగనుంది.
  • సంగీత్ క్రాస్ రోడ్ నుంచి బేగంపేట్ వచ్చే వాహనాలను వైఎంసీఏ క్లాక్ టవర్, ప్యాట్నీ, సీటీవో, రసూల్ పురా మీదుగా పంపిస్తారు.
  • బేగంపేట్ నుంచి సంగీత్ క్రాస్ రోడ్ వైపు వెళ్లే వాహనాలను బాలం రాయి, బ్రూక్ బాండ్, టివోలి, వైఎంసీఏ మీదుగా మళ్లిస్తారు.
  • బోయిన్ పల్లి, తాడ్ బండ్ వైపు నుంచి టివోలి వచ్చే వాహనాలను బ్రూక్ బాండ్ వద్ద సీటీవో, ట్యాంక్ బండ్ మీదుగా దారిమళ్లిస్తారు.
  • కార్ఖానా నుంచి ప్యాట్నీ రూట్ లో స్వీకార్ ఉపకార్ వద్ద వైఎంసీఏ, ప్యాట్నీ, టివోలి, సీటీవో వైపు మళ్లిస్తారు. ప్యాట్నీ నుంచి స్వీకార్ ఉపకార్ వైపు నో ఎంట్రీ.
  • తిరుమలగిరి ఆర్టీఏ, కార్ఖానా, మల్కాజిగిరి, సఫిల్ గూడ నుంచి ప్లాజా వైపు వచ్చే వాహనాలను టివోలి వద్ద స్వీకార్ ఉపకార్ వైపు దారి మళ్లిస్తారు.
  • జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి బేగంపేట్ వైపు వెళ్లే వాహనాలను పంజాగుట్ట వద్ద ఖైరతాబాద్, గ్రీన్ ల్యాండ్స్, రాజ్ భవన్ మీదుగా దారి మళ్లిస్తారు.

More Telugu News