Dharmana Prasad: అవును! విద్యుత్ చార్జీలు పెంచాం.. అంగీకరించిన మంత్రి ధర్మాన

Yes power charges increased says minister Dharmana Prasada Rao
  • రాష్ట్రంలో విద్యుత్ వినియోగం బాగా పెరిగిందన్న మంత్రి
  • ఆ మేరకు ప్రైవేటు కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నట్టు చెప్పిన ధర్మాన
  • ఆ భారాన్ని వినియోగదారులు భరించాల్సిందేనని స్పష్టీకరణ
ఏపీలో విద్యుత్ చార్జీలు పెంచిన మాట వాస్తవమేనని మంత్రి ధర్మాన ప్రసాదరావు అంగీకరించారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం బాగా పెరిగిందని, దీంతో ప్రైవేటు కంపెనీల నుంచి కరెంటు కొనుగోలు చేయక తప్పడం లేదన్నారు. పార్వతీపురంలో నిన్న నిర్వహించిన సామాజిక బస్సు యాత్ర సభలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

వినియోగదారుల అవసరాలు తీర్చేందుకు కొనుగోలు చేస్తున్న అదనపు కరెంటు భారాన్ని వారే భరించాల్సిందేనని స్పష్టం చేశారు. తమకు ఓటేయని ఇతర పార్టీల వారిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వాలు హింసించేవన్న ధర్మాన.. ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు.
Dharmana Prasad
Andhra Pradesh
Current Consumption
YSRCP

More Telugu News