Damodar Reddy: బీఆర్ఎస్ ను ఓడించడానికి ఇద్దరం కలిసి పని చేస్తాం: దామోదర్ రెడ్డి

Damodar Reddy on Ramesh Reddy
  • సూర్యాపేటలో నామినేషన్ వేసిన దామోదర్ రెడ్డి
  • టికెట్ ఆశించి నిరాశకు గురైన రమేశ్ రెడ్డి
  • రమేశ్ రెడ్డి బాధను అర్థం చేసుకోగలనన్న దామోదర్ రెడ్డి
సూర్యాపేట నుంచి సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి నామినేషన్ వేశారు. తుది జాబితాలో ఆయన పేరును హైకమాండ్ ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ టికెట్ ను ఆశించిన పటేల్ రమేశ్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో దామోదర్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ అభివృద్ధి కోసం ఇంత కాలం రమేశ్ రెడ్డి పని చేశారని ప్రశంసించారు. టికెట్ ఆశించిన రమేశ్ రెడ్డితో అధిష్ఠానం మాట్లాడుతుందని చెప్పారు. వివాదం లేకుండా ఇద్దరం పని చేస్తామని తెలిపారు. 

రమేశ్ రెడ్డికి టికెట్ రాలేదనే బాధ ఉంటుందని.. ఆ బాధను తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. పార్టీ నిర్ణయానికి రమేశ్ కట్టుబడి ఉంటారనే నమ్మకం తనకు ఉందని అన్నారు. తమ ఇద్దరి లక్ష్యం బీఆర్ఎస్ ను ఓడించడమేనని చెప్పారు.
Damodar Reddy
Congress
BRS

More Telugu News