Ananya Panday: విజయ్ దేవరకొండ 'లైగర్'లో నటించడం నా జీవితంలో అతి పెద్ద తప్పు: అనన్య పాండే

  • అట్టర్ ఫ్లాప్ అయిన 'లైగర్'
  • అనన్య కెరీర్ పై తీవ్ర ప్రభావం
  • అమ్మ, నాన్న బలవంతంతోనే ఈ సినిమాలో నటించానని వ్యాఖ్య
Acting in Liger movie is a big mistake says Ananya Panday

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'లైగర్' సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ నటించినప్పటికీ జనాలను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీపాండే కూతుడు అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ లో పెద్ద స్టార్ గా ఎదగాలనుకున్న అనన్యకు ఈ సినిమా డిజాస్టర్ కావడం ఎంతో నిరాశను మిగిల్చింది. 

ఈ నేపథ్యంలో తాజాగా ఆమె స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాలో తాను నటించడం తన జీవితంలోనే అతి పెద్ద తప్పిదమని ఆమె వ్యాఖ్యానించింది. తన తండ్రి చుంకీపాండే, తల్లి భావన, నిర్మాత కరణ్ జొహార్ బలవంతంతోనే తాను ఈ చిత్రంలో నటించానని చెప్పింది. ఈ సినిమాకు వచ్చినంత చెత్త రివ్యూ నా జీవితంలో ఏ సినిమాకు రాలేదని తెలిపింది. ఈ సినిమాకు కరణ్ జొహార్ ఒక సమర్పకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

More Telugu News