Revanth Reddy: రాజకీయం కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్ కోసం కామారెడ్డిలో నామినేషన్ వేశాను: రేవంత్ రెడ్డి

Revanth Reddy thanks to karnataka cm siddaramaiah
  • నామినేషన్ ప్రక్రియకు హాజరైన కర్ణాటక ముఖ్యమంత్రికి రేవంత్ ధన్యవాదాలు
  • ఇది సంచలనం కోసం కాదు, సకల జనుల సంక్షేమం కోసమని వ్యాఖ్య 
  • సూర్య భగవానుడి ఆశీస్సులతో... మార్పుతో కూడిన ఉదయం కోసం తన ప్రయత్నమని వెల్లడి
కామారెడ్డి నియోజకవర్గంలో తన నామినేషన్ ప్రక్రియకు హాజరైన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. రేవంత్, సిద్ధరామయ్య ఇరువురు ప్రత్యేక హెలికాప్టర్‌లో కామారెడ్డికి వెళ్లి, భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విజయ భేరి - బీసీ డిక్లరేషన్ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైనందుకు కర్ణాటక సీఎంకు టీపీసీసీ చీఫ్ థ్యాంక్స్ చెప్పారు.

తాను కామారెడ్డిలో నామినేషన్ వేశానని రేవంత్ రెడ్డి మరో ట్వీట్ చేశారు.
కామారెడ్డిలో నామినేషన్ వేశాను…
ఇది రాజకీయం కోసం కాదు రాష్ట్ర భవిష్యత్ కోసం
ఇది సంచలనం కోసం కాదు సకల జనుల సంక్షేమం కోసం
ఇది రైతుల కోసం, నిరుద్యోగుల కోసం, నాలుగు కోట్ల జనుల జీవితాల్లో వెలుగుల కోసం అని పేర్కొన్నారు.

సూర్య భగవానుడి ఆశీస్సులతో తెలంగాణలో మార్పుతో కూడిన ఒక్క గొప్ప ఉదయాన్ని తీసుకురావడానికి నా వంతు కృషిగా ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశానని, కామారెడ్డి ప్రజలు అందరూ ఆశీర్వదిస్తారని గట్టి నమ్మకంతో ఉన్నానని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.
Revanth Reddy
Siddaramaiah
Congress
Telangana Assembly Election

More Telugu News