Daggubati Purandeswari: పురందేశ్వరి మద్యం బ్రాండ్లను టేస్ట్ చేస్తున్నట్టున్నారు: మంత్రి అప్పల రాజు

Purandeswari tasting all liquor brads says minister Appalaraju
  • పురందేశ్వరి చంద్రముఖిగా మారారన్న అప్పల రాజు
  • బీజేపీలో పురందేశ్వరికి గౌరవం లేదని వ్యాఖ్య
  • ఆమె టీడీపీలో చేరితే బాగుంటుందని ఎద్దేవా
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై ఏపీ మంత్రి అప్పలరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మద్యం అమ్మకాలపై కొన్ని రోజులుగా పురందేశ్వరి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పలరాజు స్పందిస్తూ... పురందేశ్వరి ప్రతి రోజు మద్యం బ్రాండ్లను టేస్ట్ చేస్తున్నారేమో అంటూ వ్యాఖ్యలు చేశారు. తాను మద్యం తాగనని, తనకు మద్యం టేస్ట్ లపై అవగాహన లేదని ఆయన చెప్పారు. ఇప్పుడు ఉన్న మద్యం బ్రాండ్లన్నీ చంద్రబాబు హయాంలో వచ్చినవేనని చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పురందేశ్వరికి కొంచెం గౌరంవం ఉండేదని, ఇప్పుడు ఆమె చంద్రముఖిగా మారారని అప్పలరాజు ఎద్దేవా చేశారు. బీజేపీలో కూడా ఇప్పుడు పురందేశ్వరికి గౌరవం లేదని అన్నారు. పురందేశ్వరి బీజేపీలో ఉండటం అవసరం లేదని... టీడీపీలో చేరితే సరిపోతుందని సెటైర్లు వేశారు.
Daggubati Purandeswari
BJP
Appala Raju
YSRCP

More Telugu News