Lovers: సుదూర రిలేషన్స్‌లో ఉండే మజా ఇదే.. ఈ వీడియో అదే చెబుతోంది!

Long distance relations are always sweet look why
  • వీడియో షేర్ చేసిన టొరొంటో కంటెంట్ రైటర్ నికీషా
  • సుదూర సంబంధాల్లోని నిజమైన ప్రేమ ఇదేనన్న కంటెంట్ క్రియేటర్
  • ప్రియురాలి డ్యాన్స్‌కు ప్రియుడి ఫిదా
  • సోషల్ మీడియాలో దూసుకుపోతున్న వీడియో
ప్రాణప్రదంగా ప్రేమించిన వ్యక్తి ఐదేళ్ల తర్వాత దర్శనమిస్తే.. ఆ ఆనందం, అనుభూతి వర్ణించడానికి మాటలు సరిపోతాయా! అచ్చం అదే జరిగిందీ ఘటనలో. విమానాశ్రయంలో బాలీవుడ్ మూవీ ‘షేర్సా’లోని ‘రాతన్ లంబియన్’ పాటకు డ్యాన్స్ చేస్తూ తన ప్రియుడిని ఆహ్వానించి ఆశ్చర్యపరిచిందామె. ప్రియురాలిని అలా చూసి అతడు కాసేపు ప్రపంచాన్ని మైమరిచిపోయాడు. ఆ తర్వాత ఆలింగనం చేసుకుని అమాంతం ఎత్తి కుదిపేశాడు. వైరల్ అవుతున్న ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాను దున్నేస్తోంది.

టొరొంటోకు చెందిన కంటెంట్ క్రియేటర్ నికీషా ఈ వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. సుదూర సంబంధాలు సాధారణంగానే కనిపించినా అద్భుతంగా ఉంటాయని, అందుకు ఇదే నిదర్శనమని రాసుకొచ్చారు. అంతేకాదు.. సమయ వ్యత్యాసాలు, విభిన్న ప్రాధాన్యతలు, విశ్వసనీయ సమస్యలు, శారీరక సాన్నిహిత్యం లేకపోవడం మొదలైనవి మనందరికీ తెలిసిన సమస్యలని.. వీటివల్ల సుదూర సంబంధాలకు చెడ్డపేరు వస్తోందని పేర్కొన్నారు.

నిజానికి సమీప సంబంధాల్లోనూ టన్నుల కొద్దీ సమస్యలు ఉంటాయని అయితే, ఇవి ప్రతి జంటకు ప్రత్యేకమైనవన్నారు. అయితే, వాటి పరిష్కారానికి కట్టుబడిన సంబంధాలు మాత్రమే మనుగడలో ఉంటాయని చెప్పుకొచ్చారు. సుదూర సంబంధాల్లో మీరు సమయ పరీక్షను తట్టుకుని నిలబడతారని తాను నమ్ముతున్నానని వివరించారు. వైరల్ అయిన  ఈ వీడియోకు ఇప్పటి వరకు 3 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Lovers
Toronto
Nikishah
Viral Videos

More Telugu News