Anushka Sharma: మళ్లీ గర్భం దాల్చిన అనుష్క శర్మ? ప్రూఫ్ ఇదేనంటున్న నెటిజన్లు!

Video of Anushka Virat goes viral adding fuel to pregnancy rumors
  • నెట్టింట అనుష్క శర్మ, విరాట్ వీడియో వైరల్ 
  • వీడియోలో వదులైన దుస్తులు వేసుకున్నట్టు కనిపించిన అనుష్క 
  • బేబీ బంప్ కూడా స్పష్టంగా కనిపిస్తోందంటూ కామెంట్ల వెల్లువ
విరాట్, అనుష్క శర్మ దంపతులు తమ వ్యక్తిగత జీవితం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రైవేటు విషయాలు మీడియాతో అస్సలు పంచుకోరు. కానీ, అభిమానులు మాత్రం విరుష్క దంపతుల విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రదర్శిస్తారు. ఈ క్రమంలో అనుష్క మళ్లీ గర్భం దాల్చిందన్న వార్త వైరల్‌గా మారింది. కొన్ని రోజులుగా ఈ వార్త ట్రెండింగ్‌లో ఉన్నా విరాట్, అనుష్క మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయినా, నెటిజన్లు మాత్రం తగ్గేదేలేదంటూ తమ అభిప్రాయాలను యథేచ్ఛగా నెట్టింట పంచుకుంటున్నారు. తమ వాదనకు మద్దతుగా ఓ వైరల్ వీడియోను ప్రస్తావిస్తున్నారు. 

ఓ హోటల్‌లో విరాట్, అనుష్క ఉన్న వీడియోను సోషల్ మీడియా యూజర్ ఒకరు నెట్టింట షేర్ చేశారు. ఇందులో అనుష్క వదులైన నల్లని దుస్తుల్లో మెరిసింది. ఆ దంపతులు ఒకరి చేయి మరొకరు పట్టుకుని వెళుతున్న దృశ్యం కనిపించింది. అనుష్క మళ్లీ గర్భం దాల్చిందనడానికి ఇదే తమ ప్రూఫ్ అంటూ నెటిజన్లు హడావుడి చేసేస్తున్నారు. ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచి పెట్టేందుకే ఆమె వదులైన షర్ట్ ధరించిందని, ఆమె నడకలో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తోందని కొందరు కామెంట్ చేశారు. అంతేకాదు, ఆమె బేబీ బంప్ కూడా వీడియోలో కనిపిస్తోందని అంటున్నారు. ఫలితంగా, విరాట్-అనుష్క దంపతులు మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారారు.
Anushka Sharma
Virat Kohli
Anushka Baby Bump
Viral Videos

More Telugu News