Israel-Hamas: హమాస్ ఆకస్మిక దాడుల గురించి ఆ జర్నలిస్టులకు ముందే తెలుసా?

Did Gaza photojournalists have prior knowledge of Hamas attack on Israel
  • ఇజ్రాయెల్‌పై హమాస్ ఆకస్మిక దాడిని కవర్ చేసిన ఫ్రీలాన్స్ జర్నలిస్టులు
  • దాడులు జరుగుతున్న సమయంలో వారు అక్కడ ఉండటంపై ఇజ్రాయెలీ దౌత్యవేత్త సందేహం
  • ఖండించిన ఏపీ, సీఎన్ఎన్, రాయిటర్స్‌ సంస్థలు 
ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రసంస్థ ఆకస్మిక దాడి గురించి ఇజ్రాయెల్ దౌత్యవేత్త ఇడిత్ షమిర్ పలు సందేహాలు వ్యక్తం చేశారు. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు విరుచుకుపడుతున్న సమయంలో కొందరు ఫొటో జర్నలిస్టులు అప్పటికే అక్కడ ఉన్నట్టు ఆనెస్ట్ రిపోర్టింగ్ సంస్థ ప్రచురించిన నివేదికను నెట్టింట ప్రస్తావించారు. జర్నలిస్టులకు దాడులు జరగనున్న విషయం గురించి ముందే తెలుసా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. హమాస్ దాడులను కవర్ చేసిన హసన్ ఎస్లియా అనే ఫ్రీలాన్స్ జర్నలిస్టు ఫొటోలను షేర్ చేసిన ఇడిత్, అతడు అక్టోబర్ 7 ఊచకోతల వ్యూహకర్త యాహ్యా సిన్వర్‌తో హసన్ ఉన్న దృశ్యాలను కూడా షేర్ చేశారు. 

హసన్ ఎస్లియా ఏపీ, సీఎన్ఎన్ వంటి ప్రముఖ మీడియా సంస్థలతో కలిసి పనిచేయడంతో ఈ ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. మరోవైపు, ఈ ఘటనపై అంతర్జాతీయ మీడియా సంస్థలు స్పందించాయి. హసన్‌తో సంబంధాలు పూర్తిగా తెంచుకున్నట్టు సీఎన్ఎన్ ప్రకటించింది. అక్టోబర్ 7 దాడులపై తమకు ఎటువంటి ముందస్తు సమాచారం లేదని ఏపీ కూడా పేర్కొంది. రాయిటర్స్‌ వార్తా సంస్థ కూడా తమ వద్ద దాడులపై ముందస్తు సమాచారం ఏదీ లేదని స్పష్టం చేసింది.
Israel-Hamas
Journalists
Media Outlets

More Telugu News