CM Jagan: పులివెందులలో శ్రీకృష్ణ ఆలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్

  • ఇవాళ రాయలసీమలో సీఎం జగన్ పర్యటన
  • అన్నమయ్య జిల్లాలో పలు వివాహ కార్యక్రమాలకు హాజరు
  • అనంతరం కడప జిల్లాలోని సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటన
  • వివిధ ప్రారంభోత్సవాలకు హాజరు
CM Jagan inaugurates Sri Krishna temple in Pulivenduala

ఏపీ సీఎం జగన్ ఇవాళ రాయలసీమ పర్యటనకు వచ్చారు. అన్నమయ్య జిల్లాలో పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న సీఎం, ఆ తర్వాత కడప జిల్లాలో అడుగుపెట్టారు. సొంత నియోజకవర్గం పులివెందులలో పలు కార్యక్రమాలకు హాజరయ్యారు.

పులివెందులలో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణుడి ఆలయాన్ని ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన శిల్పారామాన్ని ప్రారంభించిన అనంతరం, శ్రీస్వామి నారాయణ్ గురుకుల పాఠశాల నిర్మాణానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ పాఠశాలకు ఏపీ ప్రభుత్వం 12 ఎకరాల భూమి కేటాయించగా... స్వామి నారాయణ్ సంస్థ రూ.60 కోట్లతో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం చేపడుతోంది. 

ఈ కార్యక్రమం అనంతరం సీఎం జగన్ ఏపీ కార్ల్ వద్ద అగ్రికల్చర్, హార్టీకల్చర్ ల్యాబ్ ను ప్రారంభించారు. అంతేకాదు, పులివెందులలోని ఆదిత్య బిర్లా టెక్స్ టైల్ యూనిట్ ను కూడా పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

More Telugu News