Revanth Reddy: నేను జైలుకు వెళ్లడానికి ఎర్రబెల్లి దయాకర్ రావు కారణం: రేవంత్ రెడ్డి

The reason I went to jail was because of Errabelli says Revanth Reddy
  • టీడీపీకి ఎర్రబెల్లి నమ్మక ద్రోహం చేశాడన్న రేవంత్
  • అవినీతి సొమ్మును అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నాడని ఆరోపణ
  • బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య
బీఆర్ఎస్ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను జైలుకు వెళ్లడానికి కారణం ఎర్రబెల్లి దయాకరరావే అని చెప్పారు. అప్పట్లో శత్రువులతో చేతులు కలిపి టీడీపీకి నమ్మక ద్రోహం చేశాడని విమర్శించారు. ఇక్కడ దోచుకున్న సొమ్మును అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నాడని అన్నారు. ఈ ఎన్నికల్లో ఎర్రబెల్లికి బొంద పెట్టాలని ఓటర్లను కోరారు. పాలకుర్తిలో కాంగ్రెస్ విజయభేరి సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్రలను అందరూ గమనిస్తున్నారని... ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెపుతారని అన్నారు. కాంగ్రెస్ నేతల ఇళ్లలో మాత్రమే ఐటీ దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. 

Revanth Reddy
Congress
Errabelli
BRS

More Telugu News