Payal Ghosh: షమీని పెళ్లి చేసుకోవడానికి రెడీ.. కానీ, ఒక కండిషన్: బాలీవుడ్ నటి పాయల్

Bollywood actress Payal Ghosh marriage proposal to Mohammed Shami
  • వరల్డ్ కప్ లో అదరగొడుతున్న మహమ్మద్ షమీ
  • 4 మ్యాచ్ లలో 16 వికెట్లు కూల్చిన ఫాస్ట్ బౌలర్
  • షమీకి పెళ్లి ప్రపోజల్ చేసిన పాయల్ ఘోష్
ప్రస్తుత వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో 4 మ్యాచ్ లు ఆడిన షమీ 16 వికెట్లను పడగొట్టాడు. వీటిలో రెండు మ్యాచ్ లలో ఐదేసి వికెట్లు తీసి సత్తా చాటాడు. షమీ బౌలింగ్ పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురుస్తున్నాయి. ఆయన బౌలింగ్ కు బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ కూడా ఫిదా అయింది. అంతేకాదు షమీకి పెళ్లి ప్రపోజల్ కూడా చేసింది. 

షమీని పెళ్లి చేసుకోవడానికి తాను రెడీ అని సోషల్ మీడియా వేదికగా పాయల్ తెలిపింది. అయితే ఒక కండిషన్ కూడా పెట్టింది. షమీ తన ఇంగ్లీష్ ను మెరుగు పరుచుకోవాలని చెప్పింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. పెళ్లి చేసుకోవడానికి, భాషకు సంబంధం ఏమిటని కొందరు నెటిజెన్లు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు పాయల్ ఘోష్ తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా పరిచయమే. మంచు మనోజ్ నటించిన 'ప్రయాణం' సినిమాతో ఆమె సినీ పరిశ్రమకు పరిచయమయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.
Payal Ghosh
Bollywood
Mohammed Shami
Marriage

More Telugu News