Chandrababu: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ

Supreme court to hear Chandrababu bail petition in Fibergrid case
  • ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు
  • హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన చంద్రబాబు
  • ఐటెం నెంబర్ 11గా లిస్ట్ అయిన చంద్రబాబు పిటిషన్
ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఐటెం నెంబర్ 11గా లిస్ట్ అయిన ఈ పిటిషన్ ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం కాసేపట్లో విచారించనుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ఇంతకు ముందు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆయన విన్నపాన్ని హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు. అయితే, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తాను తీర్పును ఇచ్చేంత వరకు ఆగాలని గత విచారణలో ధర్మాసనం సూచించింది. ఈ నేపథ్యంలో ఈనాటి విచారణలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Chandrababu
Telugudesam
AP Fibergrid Case
Supreme Court

More Telugu News