IPS Sajjanar: ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ షేర్ చేసిన షాకింగ్ వీడియో వైరల్

  • గుజరాత్‌లోని ఆనంద్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం
  • ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టిన వైనం
  • బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి, అతడి కుమార్తె మృతి, భార్యకు తీవ్ర గాయాలు 
  • అతివేగమే ఈ అనర్థానికి కారణమన్న సజ్జనార్
RTC MD sajjanar shares shocking video of road accident in Gujarat

అతివేగం అనర్థదాయకమని ట్రాఫిక్ పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ఇలాంటి ఘటనలు తరచూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఎవరో చేసిన తప్పుకు మరెవరో బలైపోతూ కుటుంబాలు ఛిన్నాభిన్నమైపోతున్నాయి. ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి తండ్రీకూతుళ్లు ప్రాణాలు విడిచిన షాకింగ్ వీడియోను తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా షేర్ చేశారు. గుజరాత్‌లో ఇటీవల జరిగిన భయానక రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇది. 

ఆనంద్ ప్రాంతంలో ఓ కారు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో అతివేగంగా వెళుతూ ఎదురుగా బైక్‌పై వస్తున్న ఓ కుటుంబాన్ని డీకొట్టింది. ఈ క్రమంలో బైక్‌పై ఉన్న భార్యాభర్తలు వారి ఐదేళ్ల కుమార్తె ఒక్కసారిగా గాల్లో ఎగిరిపడ్డారు. తండ్రి, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందగా, తల్లికి తీవ్ర గాయాలయ్యాయని సజ్జనార్ తెలిపారు. అతివేగం తెచ్చిన అనర్థం ఇదంటూ విచారం వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

More Telugu News