Voter: ఈసీ కీలక నిర్ణయం.. ఓటరుతో పాటు సహాయకులకు కూడా ఇంకు గుర్తు

Ink mark to voter aides
  • తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం
  • సహాయకుల కుడి చేతి వేలికి సిరా గుర్తు వేయాలని నిర్ణయం
  • పోలింగ్ ఏజెంట్లుగా సర్పంచ్ లు, వార్డు సభ్యులు కూర్చునేందుకు అనుమతి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులు, వికలాంగులు తదితర ఓటర్లతో పాటు పోలింగ్ బూత్ లకు సహాయకులుగా వచ్చేవారి చేతి వేలిపై కూడా సిరా గుర్తును వేయాలని నిర్ణయించింది. సహాయకుల కుడి చేతి చూపుడు వేలికి ఇంకు గుర్తు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఓటర్లకు ఎడమ చేతి వేలిపై సిరా గుర్తు పెడతారు. పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఏజెంట్లుగా సర్పంచ్ లు, వార్డు సభ్యులు కూర్చునే అవకాశాన్ని కూడా సీఈసీ కల్పించింది. మాక్ పోలింగ్ ను ఉదయం 5.30 గంటలకు ప్రారంభించాలని సూచించింది.
Voter
Helper
Ink Mark

More Telugu News