Jagan: సీఎం జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

  • అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యంపై హరిరామజోగయ్య పిటిషన్
  • ఎన్నికల్లోగా తీర్పులను వెలువరించాలని పిటిషన్ లో విన్నపం
  • జగన్, సీబీఐ, సీబీఐ కోర్టులకు తెలంగాణ హైకోర్టు ఆదేశం
Telangana High Court sends notices to CM Jagan in Disproportionate Assets Case

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ మాజీ ఎంపీ హరిరామజోగయ్య పిటిషన్ వేశారు. ఎన్నికలు జరిగే లోపల ఈ కేసులపై తీర్పులను వెలువరించాలని పిటిషన్ లో ఆయన కోరారు. అయితే, ఆయన పిటిషన్ ను పిల్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం)గా స్వీకరించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ కొంత అభ్యంతరం తెలిపింది. ఈ అభ్యంతరాలపై హైకోర్టులో సుదీర్ఘ వాదలను కొనసాగాయి. జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రావణ్ కుమార్ పిటిషన్ ను విచారించారు. వాదనల అనంతరం పిటిషన్ ను పిల్ గా మార్చేందుకు హైకోర్టు ధర్మాసనం అంగీకరించింది. పిల్ గా మార్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ముఖ్యమంత్రి జగన్, సీబీఐ, సీబీఐ కోర్టులకు నోటీసులు జారీ చేసింది. తరుపరి విచారణల్లో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? సీబీఐకి, సీబీఐ కోర్టుకు ఎలాంటి ఆదేశాలను ఇవ్వబోతోంది? అనే విషయం ఉత్కంఠగా మారింది. 

More Telugu News