Rahul Gandhi: కేదార్ నాథ్ ఆలయంలో ఒకరికొకరు ఎదురుపడిన రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ

Rahul Gandhi and Varun Gandhi met each other at Kedarnath temple
  • కాంగ్రెస్ పార్టీ అగ్రనేతగా ఉన్న రాహుల్
  • బీజేపీ ఎంపీగా ఉన్న వరుణ్ 
  • కేదార్ నాథ్ ఆలయం వద్ద ఆప్యాయంగా మాట్లాడుకున్న సోదరులు
సోనియా గాంధీ, మేనకా గాంధీ తోడికోడళ్లన్న సంగతి తెలిసిందే. సోనియా తనయుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేత కాగా, మేనకాగాంధీ కుమారుడు వరుణ్ గాంధీ బీజేపీ ఎంపీగా ఉన్నారు. రాహుల్ కంటే వరుణ్ పదేళ్లు చిన్నవాడు. ఇద్దరూ గాంధీ కుటుంబానికి చెందిన వారే అయినా వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. 

తాజాగా, ఈ సోదరులిద్దరూ అనుకోకుండా కలిశారు. రాహుల్ గాంధీ గత మూడ్రోజులుగా ఉత్తరాఖండ్ లో పర్యటిస్తున్నారు. పర్యటన ముగింపు సందర్భంగా ఆయన కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించారు. అదే సమయంలో, వరుణ్ గాంధీ తన కుటుంబంతో కలిసి ఆలయానికి విచ్చేశారు. 

ఈ క్రమంలో రాహుల్, వరుణ్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా పరస్పరం ఆప్యాయంగా పలకరించుకున్నారు. వరుణ్ కుమార్తెను చూసి రాహుల్ సంతోషం వ్యక్తం చేశారు. ఆలయం వెలుపల రాహుల్, వరుణ్ కాసేపు మాట్లాడుకున్నారు. అయితే, వీరిద్దరి మధ్య రాజకీయ అంశాలు చర్చకు రాలేదని సన్నిహితవర్గాలు వెల్లడించాయి.
Rahul Gandhi
Varun Gandhi
Kedarnath Temple
Congress
BJP
India

More Telugu News