Narendra Modi: వేదికపై నా వెంట పవన్ కల్యాణ్ ఉన్నారు... మైదానంలో జనసునామీ ఉంది!: ప్రధాని మోదీ

PM Modi takes Pawan Kalyan name in bc atma gourava meeting
  • ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొన్న మోదీ, పవన్ కల్యాణ్
  • తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి మీరు వచ్చారన్న ప్రధాని మోదీ
  • తెలంగాణకు బీజేపీపై విశ్వాసముందని మీరు సందేశం తీసుకొచ్చారన్న ప్రధాని
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వెంట ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో మోదీ, పవన్ కల్యాణ్, కిషన్ రెడ్డి, డాక్టర్ కె లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. సభలో చివరలో ప్రధాని మోదీ మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని స్పష్టం చేశారు. అత్యధిక బీసీ ఎంపీలు బీజేపీ నుండే ఉన్నారని తెలిపారు. కేంద్ర కేబినెట్లో ఓబీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కంటే ఎక్కువ మందికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించారు.

'ఈ వేదికపై పవన్ కల్యాణ్ నాతో ఉన్నారు. మైదానంలో తుపాను (జన సునామీ) ఉంది. ఈ మైదానంలో మార్పు తుపానును నేను చూస్తున్నాను. మీరు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణకు బీజేపీపై విశ్వాసం ఉందని స్పష్టమైన సందేశం తీసుకొచ్చారు' అని పేర్కొన్నారు.
Narendra Modi
Pawan Kalyan
BJP
Telangana Assembly Election

More Telugu News