Jara Patel: రష్మిక డీప్ ఫేక్ వీడియో.. ఒరిజినల్‌ వీడియోలో ఉన్న జరా పటేల్‌ ఏమన్నారంటే..!

Jara Patel response on Rashmika Mandanna Deepfake video
షార్ట్స్‌లో చూడండి
సినీ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సంచలనాన్ని సృష్టిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ఈ వీడియోను తయారు చేశారు. తాజాగా ఈ ఒరిజినల్ వీడియో క్లిప్ లో ఉన్న జరా పటేల్ ఈ అంశంపై స్పందించారు. టెక్నాలజీని ఉపయోగించి తన శరీరానికి బాలీవుడ్ నటి ముఖాన్ని జోడించిన వీడియో వైరల్ అవుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని ఆమె తెలిపారు. ఇందులో తన ప్రమేయం లేదని... జరిగిన దానికి తాను చింతిస్తున్నానని చెప్పారు.

మహిళలు, చిన్నారుల భవిష్యత్తు ఏమవుతుందో అని తాను ఆందోళన చెందుతున్నానని జరా పటేల్ అన్నారు. ఇలాంటి వాటిని ఎవరూ ప్రోత్సహించకూడదని చెప్పారు. సోషల్ మీడియాలో ఏది పంచుకోవాలన్నా భయపడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. మనం ఇంటర్నెట్ లో చూసేది ఏదీ నిజం కాదని చెప్పారు. ప్రతి దాని విషయంలో అది నిజమా? కాదా? అని నిర్ధారించుకోవాల్సి ఉందని అన్నారు.   
ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన జరా పటేల్ బ్రిటీష్ ఇండియన్. ఆమె ఖాతాను 4 లక్షలకు మందికి పైగా ఫాలో అవుతున్నారు. డేటా ఇంజినీర్ గా, మెంటల్ హెల్త్ అడ్వొకేట్ గా ఆమె పని చేస్తున్నారు.
Go Back to Shorts
Jara Patel
Rashmika Mandanna
Deepfake Video
Tollywood
Bollywood

More Telugu News