Game Changer: రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' ఆడియో రైట్స్ 'సరిగమ' సొంతం

  • రామ్ చరణ్, శంకర్ కాంబోలో గేమ్ చేంజర్
  • దిల్ రాజు నిర్మాతగా పాన్ ఇండియా చిత్రం
  • రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా కియారా అద్వానీ
  • తమన్ సంగీతం
Saregama acquired Game Changer audio rights

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ భారీ చిత్రం ఆడియో హక్కుల అప్ డేట్ వచ్చింది. గేమ్ చేంజర్ ఆడియో రైట్స్ ను 'సరిగమ గ్లోబల్' చేజిక్కించుకుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. శంకర్ సినిమా అనగానే ఆడియోపై ఓ రేంజ్ లో అంచనాలు ఉంటాయి. శంకర్ తొలి చిత్రం జెంటిల్ మన్ నుంచి రోబో వరకు అన్నీ మ్యూజికల్ హిట్లే. ఇప్పుడు గేమ్ చేంజర్ పాటలపైనా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More Telugu News