ఇలాంటి కూతుళ్లు పుట్టాలని ఎవరూ కోరుకోరు: పురందేశ్వరిని మరోసారి టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి

  • తండ్రికి ఒక్క ముద్ద కూడా పెట్టలేదంటూ విజయసాయి విమర్శ
  • ఎన్టీఆర్ ఇంటికి 10 అడుగుల దూరంలో ఉండి కూడా ఏమీ చేయలేదని వ్యాఖ్య
  • ఏం కూతురివమ్మా నీవు అంటూ తీవ్ర వ్యాఖ్యలు
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఎక్స్ వేదికగా ఆమెను విజయసాయి టార్గెట్ చేశారు. ఎన్టీఆర్ గారి ఇంటికి పదడుగుల దూరంలో ఉండి కూడా ఆయనకు ఒక్క ముద్ద కూడా పెట్టలేదు కదా చెల్లెమ్మా పురందేశ్వరీ... అంటూ ఎద్దేవా చేశారు. 

'ఆ వయస్సులో ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కూడా కష్టపడి సాధించుకున్న అధికారాన్ని 8 నెలలు కూడా తిరక్కుండానే  మీరు, మీ భర్త, మీ బావ గారితో చేతులు కలిపి... పాపం! 73 ఏళ్ల వయస్సులో ఆ పెద్దాయనను నిర్దాక్షిణ్యంగా కిందికి లాగిపడేశారే. ఏం కూతురివమ్మా నీవు? శత్రువుకి కూడా ఇలాంటి కూతుళ్ళు పుట్టాలని ఎవరూ కోరుకోరమ్మా!' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


More Telugu News

Vijayasai Reddy YSRCP Daggubati Purandeswari BJP