జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌కు కోర్టులో భారీ ఊరట
- హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు
- కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు
- అజారుద్దీన్‌కు బెయిల్ మంజూరు చేసిన మల్కాజిగిరి కోర్టు
ఫండ్స్ వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన లావు నాగేశ్వరరావు కమిటీ ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. అయితే ముందస్తు బెయిల్ కోసం ఆయన మల్కాజిగిరి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సోమవారం నాడు విచారించిన న్యాయస్థానం అజారుద్దీన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో పోలీసుల విచారణకు సహకరించాలని అజారుద్దీన్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.