Revanth Reddy: సీపీఐతో కుదిరిన కాంగ్రెస్ పొత్తు... కొత్తగూడెం అసెంబ్లీ టిక్కెట్, ఆ తర్వాత రెండు ఎమ్మెల్సీలు

Congress allots Kothagudem seat to CPI
  • సీపీఐ కార్యాలయానికి వచ్చిన రేవంత్ రెడ్డి
  • సీపీఐతో పొత్తు ఖరారైందని ప్రకటన
  • కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి గెలుపుకు కాంగ్రెస్ కృషి చేస్తుందని వెల్లడి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐతో పొత్తు కుదిరినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అధిష్ఠానం సూచనలతో రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని సీపీఐ కార్యాలయానికి వచ్చారు. ఆయనకు సీపీఐ కార్యాలయంలో కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి స్వాగతం పలికారు. ఇరు పార్టీల నేతలు సీట్ల అంశంపై చర్చించారు. ఎన్నికలలో ఒక సీటు, ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని వారికి రేవంత్ చెప్పారు. దీనికి సీపీఐ కూడా అంగీకరించింది.

అనంతరం రేవంత్ మాట్లాడుతూ... సీపీఐతో పొత్తు ఖరారైందన్నారు. కొత్తగూడెం నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆ స్థానంలో సీపీఐ అభ్యర్థి గెలుపుకు కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. ఎన్నికల అనంతరం తాము అధికారంలోకి వచ్చాక సీపీఐకి రెండు ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు. సీపీఐకి శాసన సభతో పాటు మండలిలోనూ ప్రాతినిధ్యం ఉండాలన్నారు. కాంగ్రెస్, సీపీఐ సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Revanth Reddy
cpi
Bhadradri Kothagudem District
Congress
Telangana Assembly Election

More Telugu News