KA Paul: తొలి జాబితా ప్రకటించిన కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ

KA Paul Praja Santhi party announced first list with 12 candidates
  • తెలంగాణలో ఎన్నికల కోలాహలం
  • నవంబరు 30న పోలింగ్
  • 12 మందితో ప్రజాశాంతి పార్టీ తొలి జాబితా విడుదల చేసిన కేఏ పాల్
  • రేపు రెండో జాబితా విడుదలవుతుందని వెల్లడి
తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజాశాంతి పార్టీ సందడి చేయడం మామూలే. ఈ క్రమంలో, ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం నేడు తొలి జాబితా విడుదల చేసింది. 12 మందితో కూడిన ఈ జాబితాను ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ మీడియాకు విడుదల చేశారు. రేపు రెండో జాబితా విడుదల చేస్తామని వెల్లడించారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ టికెట్ కోసం 344 మంది దరఖాస్తు చేసుకున్నారని కేఏ పాల్ తెలిపారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిచ్చే పార్టీ ప్రజాశాంతి పార్టీ అని స్పష్టం చేశారు.

ప్రజాశాంతి పార్టీ తొలి జాబితాలో ఉన్నది వీళ్లే...
1. కందూరు అనిల్ యాదవ్- ఉప్పల్
2. కట్టా జంగయ్య- కల్వకుర్తి
3. కొప్పుల శ్రీనివాస్ రావు- మధిర
4. మొయ్య రాంబాబు- చెన్నూరు
5. పాండు- గజ్వేల్
6. సిరిపురం బాబు-నర్సాపూర్
7. కర్రోల్ల మోహన్- జుక్కల్ (ఎస్సీ)
8. బంగారు కనకరాజు- రామగుండం
9. బేగరి దశరథ్- జహీరాబాద్
10. కదిర కిరణ్ కుమార్- నకిరేకల్
11. సిల్లివేరు నరేశ్- యాకుత్ పురా
12. అజ్మీరా రమేశ్- వేములవాడ
KA Paul
Praja Santhi Party
First List
Telangana

More Telugu News