Samantha: సమంతకు క్రయోథెరపీ.. అసలు ఈ ట్రీట్మెంట్ ఎందుకు చేస్తారంటే..!

What is Cryotherapy that actress Samantha undergone
  • మయోసైటిస్ తో బాధపడుతున్న సమంతకు క్రయోథెరపీ
  • అనారోగ్య కణజాలాన్ని ఈ థెరపీ నాశనం చేస్తుంది
  • పలు క్యాన్సర్లకు ఈ థెరపీని నిర్వహిస్తున్న వైద్య నిపుణులు
  • మైనస్ 85 నుంచి మైనస్ 140 డిగ్రీల ఉష్ణోగ్రతలో కొనసాగే చికిత్స
  • మయోసైటిస్ కి మంచి థెరపీ అంటున్న నిపుణులు
ప్రముఖ సినీ నటి సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చిన సామ్... ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతోంది. ఇందులో భాగంగా ఆమె క్రయోథెరపీ చేయించుకుంటోంది. ఈ నేపథ్యంలో క్రయోథెరపీ అంటే ఏమిటో... కొన్ని వివరాలు తెలుసుకుందాం. 

క్రయోథెరపీ అనేది అత్యంత చల్లటి ఉష్ణోగ్రతలో చేసే ఒక చికిత్స. గడ్డకట్టించేంత ఉష్ణోగ్రతలో పేషెంట్లకు చికిత్స చేస్తారు. రోగులు క్రయోజనిక్ టబ్ లో కొన్ని నిమిషాల పాటు ఉండాల్సి ఉంటుంది. దీని వల్ల మయోసైటిస్ వల్ల వచ్చిన కండరాల నొప్పి, వాపు వంటి సమస్యలు తగ్గుతాయి. మయోసైటిస్ కు ఇది మంచి థెరపీ అని వైద్య నిపుణులు చెపుతారు. అనారోగ్యపూరితమైన కణజాలాన్ని ఈ థెరపీ నాశనం చేస్తుంది. 

పలు క్యాన్సర్ల చికిత్సలకు కూడా ఈ థెరపీని నిర్వహిస్తుంటారు. బోన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, ప్రారంభ దశలో ఉన్న స్కిన్ క్యాన్సర్ తదితర చికిత్సలకు ఈ థెరపీని చేస్తారు. కొంచె నొప్పిగా ఉన్నా ఈ థెరపీ మంచి ఫలితాలను ఇస్తుందని చెపుతారు. అత్యంత చల్లదనం వల్ల అనారోగ్య కణజాలం నశిస్తుంది. చర్మం వెలుపల ఉన్న టిష్యూలతో పాటు, శరీరంలోని టిష్యూలను కూడా ఈ థెరపీ ద్వారా ట్రీట్ చేయవచ్చు. ఈ చికిత్సలో అత్యంత చల్లదన్నాన్ని సృష్టించేందుకు లిక్విడ్ నైట్రోజన్, ఆర్గాన్ గ్యాస్ లను వాడతారు. లెవెల్స్ ని బట్టి మైనస్ 85 నుంచి మైనస్ 140 డిగ్రీల సెల్సియస్ వద్ద చికిత్స కొనసాగుతుంది. పేషెంట్ కండిషన్ ను బట్టి లోకల్ అనస్తీషియా లేదా జనరల్ అనస్తీషియాను ఇస్తారు.
Samantha
Cryotherapy
Tollywood

More Telugu News