Vijay Sai Reddy: సోషల్ మీడియాలో పురందేశ్వరిపై విజయసాయి రెడ్డి విమర్శలు

Vijayasai reddy lashes out at purandeshwari in social media
  • నమ్మకద్రోహం పురందేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉందని వ్యాఖ్య
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైనా టీడీపీ సేవ చేస్తున్నారని విమర్శ
  • విలువల్లేని రాజకీయాలకు కేరాఫ్‌గా మారారని మండిపాటు
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై మరోసారి సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. నమ్మకద్రోహం పురందేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉందని దుయ్యబట్టారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతూ విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా పురందేశ్వరి మారారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలై ఉండీ టీడీపీకి సేవ చేస్తున్నారని దుయ్యబట్టారు. పురందేశ్వరి, ఆమె భర్త చంద్రబాబు పల్లకీ మోస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణకు చెందిన ‘అన్న టీడీపీ’కి కొంత కాలం గౌరవ అధ్యక్షురాలిగా ఉండి ఆ పార్టీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యాక కాంగ్రెస్‌లో చేరారంటూ మండిపడ్డారు.
Vijay Sai Reddy
Daggubati Purandeswari

More Telugu News