Virat Kohli: 13 ఏళ్ల నాటి కోహ్లీ ట్వీట్ వైరల్.. అభిమానుల్లో సంబరం

Virat kohlis old tweet goes viral amid his 49th century
  • టీం కోసం పరుగులు చేస్తా అంటూ 2010లో విరాట్ ట్వీట్
  • సచిన్ రికార్డు సమం చేసిన నేపథ్యంలో నాటి ట్వీట్ వైరల్ 
  • మాట నిలబెట్టుకున్నాడంటూ అభిమానుల్లో సంబరం

కింగ్ కోహ్లీ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూసిన అద్భుత క్షణం రానేవచ్చింది. దక్షిణాఫ్రికాతో నిన్నటి వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌‌లో కోహ్లీ 49వ శతకం కొట్టి సచిన్ వన్డే సెంచరీల రికార్డును సమం చేశాడు. తన పుట్టినరోజునే ఈ అద్భుతం సాధించి అభిమానుల ఆనందం అంబరాన్ని అంటేలా చేశాడు. దీంతో, టీమిండియా అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ క్రమంలో పరుగుల యంత్రం కోహ్లీ సుమారు 13 ఏళ్ల క్రితం చేసిన ఓ ట్వీట్‌ను నెటిజన్లు తవ్వితీశారు. ‘టీం తరపున బోలెడన్ని పరుగులు చేసేందుకు ఉత్సుకతో ఉన్నా’ అంటూ కోహ్లీ ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. నాటి మాట కెరీర్ ఆసాంతం నిలబెట్టుకుంటూ వస్తున్నాడని అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. యావత్ దేశ ఆశలు మోస్తున్నా సునాయాసంగా పరుగుల వరద పారించాడంటూ కామెంట్ల వరద పారిస్తున్నారు.

  • Loading...

More Telugu News