Jabardasth: ‘జబర్దస్త్’ కొత్త యాంకర్‌గా సిరి హన్మంత్.. ఆమె ప్రొఫైల్ ఇదే

Siri Hanmanth as the new anchor of Jabardasth this is her profile
  • లేటెస్ట్ ప్రోమోలో కొత్త యాంకర్‌ పరిచయం
  • పలు సీరియల్స్‌తోపాటు బిగ్‌బాస్ సీజన్-5లో మెరిసిన సిరి
  • ఇటీవలే బ్లాక్ బాస్టర్ సాధించిన ‘జవాన్‌’ సినిమాలోనూ కీలక పాత్ర
తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన ఆదరణ ఉన్న బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’కు కొత్త యాంకర్‌ను పరిచయం చేశారు. సౌమ్య రావు స్థానంలో కొత్త యాంకర్‌గా సిరి హన్మంత్‌ను తీసుకున్నారు. తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా ఆమెను పరిచయం చేశారు. సిరి హన్మంత్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. ఇటీవలే బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన షారుక్ ఖాన్ ‘జవాన్’ సినిమాలో ఆమె కనిపించింది. ఓ పాత్రలో అలరించింది. ఈ సినిమాతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

సిరి హన్మంత్ పలు సీరియల్స్‌లోనూ నటించి మెప్పించింది. అంతేకాదు బిగ్‌బాస్ సీజన్-5లోనూ మెరిసింది. హౌస్‌లో ఉన్నప్పుడు యూట్యూబర్ షణ్ముఖ్‌తో ఆమె వ్యక్తిగత స్నేహంపై సోషల్ మీడియాలో చర్చ కూడా జరిగింది. ఈ ఎపిసోడ్‌తో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. కెరీర్ తొలినాళ్లలో షార్ట్ ఫిల్మ్స్ చేసి గుర్తింపుతోపాటు ఫాలోయింగ్‌ సంపాదించుకున్న సిరి ఇప్పుడు ఏకంగా జబర్దస్త్‌ అవకాశాన్ని దక్కించుకుంది. మరి కొత్త వేదికపై ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో వేచిచూడాలి. 

కాగా బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’కు సంబంధించిన యాంకర్లు, జడ్జీలు క్రమంగా మారుతున్న విషయం తెలిసిందే. రోజా, నాగబాబు షోకు తొలుత జడ్జీలుగా వ్యవహరించారు. చాన్నాళ్ల తర్వాత తప్పుకున్నారు. ఆ తర్వాత మను, ఖుష్బూ జడ్జీలుగా వ్యవహరించారు. ఇప్పుడు కృష్ణ భగవాన్, ఇంద్రజ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఇక పలువురు యాంకర్లు కూడా మారిన విషయం తెలిసిందే.
Jabardasth
Siri Hanmanth
Soumya Rao
Talking Movies

More Telugu News