Rain: బెంగళూరులో మళ్లీ వర్షం... నిలిచిన పాక్-కివీస్ మ్యాచ్

  • వరల్డ్ కప్ లో పాకిస్థాన్ × న్యూజిలాండ్
  • 50 ఓవర్లలో 6 వికెట్లకు 401 పరుగులు చేసిన కివీస్
  • వర్షం వల్ల పాక్ టార్గెట్ 41 ఓవర్లలో 342 పరుగులకు కుదింపు
  • ప్రస్తుతం 25.3 ఓవర్లలో 1 వికెట్ కు 200 పరుగులు చేసిన పాక్
  • రెండోసారి అంతరాయం కలిగించిన వర్షం 
Rain halts New Zealand and Pakistan match again

బెంగళూరులో వరుణుడు మరోమారు తడాఖా చూపించాడు. దాంతో పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ మళ్లీ నిలిచిపోయింది. వర్షం వల్ల రెండోసారి మ్యాచ్ నిలిచిపోయే సమయానికి పాక్ 25.3 ఓవర్లలో 1 వికెట్ కు 200 పరుగులు చేసింది. ఫఖార్ జమాన్ 126, కెప్టెన్ బాబర్ అజామ్ 66 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే, డీఎల్ఎస్ సమీకరణం ప్రకారం పాకిస్థానే విజేతగా నిలుస్తుంది. డీఎల్ఎస్ స్కోరుకు పాక్ 21 పరుగులు అదనంగా సాధించింది. ఒకవేళ వర్షం తగ్గి మ్యాచ్ మొదలైతే పాక్ ఇంకా 93 బంతుల్లో 142 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఫఖార్ జమాన్, బాబర్ అజామ్ ఊపు చూస్తే ఈ టార్గెట్ ను చేరుకునేట్టు కనిపిస్తున్నారు.

పాక్ ఛేజింగ్ లో తొలుత వర్షం పడడంతో టార్గెట్ ను 41 ఓవర్లలో 342 పరుగులకు కుదించిన సంగతి తెలిసిందే.

More Telugu News