Dum Masala: మహేశ్ బాబు 'దమ్ మసాలా'... గుంటూరు కారం నుంచి తొలి పాటకు రంగం సిద్ధం

Promo of first single from Mahesh Babu starring Guntur Kaaram will be out tomorrow
  • మహేశ్ బాబు, త్రివిక్రమ్ కలయికలో గుంటూరు కారం
  • రేపు తొలి పాట ప్రోమో విడుదల
  • దీపావళికి 'దమ్ మసాలా' పూర్తి పాట విడుదలయ్యే చాన్స్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రం నుంచి అభిమానులకు అప్ డేట్ వచ్చింది. తొలి పాట ప్రోమో రేపు ఉదయం 11.07 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు చిత్రబృందం సోషల్ మీడియాలో వెల్లడించింది. గుంటూరు కారం నుంచి మాంచి మాస్ బీట్ తో దమ్ మసాలా సాంగ్ వస్తోంది... అభిమానులు సిద్ధంగా ఉండండి అంటూ చిత్రబృందం పేర్కొంది. 

కాగా, దమ్ మసాలా పూర్తి పాట దీపావళికి వచ్చే అవకాశాలున్నాయి. గుంటూరు కారం చిత్రంలో మహేశ్ సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
Dum Masala
Guntur Kaaram
Mahesh Babu
Trivikram Srinivas
Thaman
Tollywood

More Telugu News