Pawan Kalyan: జూబ్లీహిల్స్ లో చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ కల్యాణ్

Pawan Kalyan visits Chandrababu residence in Hyderabad
  • హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రి నుంచి చంద్రబాబు నిన్న డిశ్చార్జి
  • ఈ ఉదయం ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో కంటి పరీక్షలు
  • మంగళవారం నాడు కంటికి శస్త్రచికిత్స చేయించుకునే అవకాశం
  • చంద్రబాబును పరామర్శించిన పవన్ కల్యాణ్
టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇవాళ ఉదయం నగరంలోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి వెళ్లి కంటి పరీక్షలు చేయించుకుని వచ్చారు. చంద్రబాబు మంగళవారం నాడు కంటికి సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో, చంద్రబాబును జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. ఇవాళ పవన్ కల్యాణ్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.65లోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. పవన్ వెంట జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. 

ఈ సందర్భంగా పవన్... చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా పూర్తి ఆరోగ్యం సంతరించుకోవాలని ఆకాంక్షించారు.
Pawan Kalyan
Chandrababu
Hyderabad
Janasena
TDP
Andhra Pradesh

More Telugu News