V Srinivas Goud: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సుప్రీంకోర్టు నోటీసులు.. కారణం ఇదే!

  • 2018 ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ పిటిషన్
  • పిటిషన్ వేసిన మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్రరాజు  
  • పిటిషన్ పై సమాధానం చెప్పాలంటూ శ్రీనివాస్ గౌడ్ కు సుప్రీం నోటీసులు
Supreme Court notices to minister Srinivas Goud

బీఆర్ఎస్ నేత, తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే... 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రీనివాస్ గౌడ్ తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇటీవలే పిటిషన్ ను కొట్టి వేసింది. దీంతో, హైకోర్టు తీర్పును రాఘవేంద్రరాజు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 

రాఘవేంద్రరాజు పిటిషన్ పై సుప్రీంకోర్టులోని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాఘవేంద్రరాజు పిటిషన్ పై సమాధానం చెప్పాలంటూ శ్రీనివాస్ గౌడ్ కు నోటీసులు జారీ చేసింది.

More Telugu News