Cricket: వరల్డ్ కప్‌లో నేడు ఉత్కంఠభరిత మ్యాచ్‌లు.. ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ గెలిస్తే..?

  • ఆసీస్‌పై ఇంగ్లండ్ గెలిస్తే ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు మెరుగు
  • మరో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొడుతున్న పాకిస్థాన్
  • లీగ్ దశ చివరికి చేరుకోవడంతో సెమీస్ బెర్తులపై ఉత్కంఠ
Afghanistan go past Pakistan and England on brink of elimination

భారత్ వేదికగా జరుగుతన్న వన్డే వరల్డ్ కప్ 2023 లీగ్ దశ ముగింపునకు చేరుకుంది. ప్రతీ జట్టు ఇంకో 2 మ్యాచ్‌లు ఆడితే లీగ్ దశ సమాప్తం అవుతుంది. అయితే ఇప్పటికీ సెమీఫైనల్ బెర్తులు ఇంకా ఖరారు కాకపోవడంతో  టోర్నీలో ఇకపై జరిగే మ్యాచ్‌‌లు జట్లకు చాలా కీలకం కాబోతున్నాయి. ముఖ్యంగా నేడు (శనివారం) జరగబోయే 2 మ్యాచ్‌లు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. 

చిరకాల ప్రత్యర్థులు ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో వెలువడే ఫలితం సెమీఫైనల్ బెర్తులను ఉత్కంఠగా మార్చనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిస్తే పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్లకు సెమీస్ అవకాశాలు మరింత మెరుగయ్యే అవకాశాలుంటాయి. ప్రస్తుతం 6 మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలు సాధించిన ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. ఇంగ్లండ్ చేతిలో ఓడిపోతే ఆఫ్ఘనిస్థాన్, న్యూజిలాండ్‌ మాదిరిగా 7 మ్యాచుల్లో 4 గెలుపులతో సమంగా ఉంది. ఫలితంగా తదుపరి మ్యాచ్‌ల్లో గెలుపోటములను బట్టి పాకిస్థాన్‌కు సెమీస్ అవకాశాలు మెరుగయ్యే అవకాశాలుంటాయి.

ఇక ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌కు ముందు నేడు(శనివారం) న్యూజిలాండ్‌ను పాకిస్థాన్ ఢీకొట్టనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిస్తేనే సెమీస్ అవకాశాలు మెరుగుపడతాయి. లేదంటే అవకాశాలు అత్యంత సంక్లిష్టంగా మారతాయి. ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ గెలిచినా ప్రయోజనం లేదనే చెప్పాలి. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అట్టడుగు స్థానంలో ఉన్న ఇంగ్లండ్ ఆసీస్‌పై గెలిస్తే సెమీ ఫైనల్ అవకాశాలు టెక్నికల్‌గా కనిపిస్తాయి. కానీ చేరుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అద్భుతాలు జరిగే తప్ప అది దాదాపు అసాధ్యం.

More Telugu News