Urfi javed: నకిలీ అరెస్టు వీడియో.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఉర్ఫీ జావేద్‌పై కేసు

Case against Uorfi Javed others for creating fake video of her arrest
  • కురచ దుస్తులు వేసుకున్నందుకు తనను అరెస్టు చేసినట్టు ఉర్ఫీ ఫేక్ వీడియో 
  • వీడియో సోషల్ మీడియాలో వైరల్, నెట్టింట కలకలం
  • ఉర్ఫీని అరెస్టు చేయలేదని ముంబై డీసీపీ వివరణ
  • వివిధ సెక్షన్ల కింద ఉర్ఫీపై కేసు నమోదు
తాను అరెస్టయినట్టు ఫేక్ వీడియో సృష్టించి కలకలం రేపిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఉర్ఫీ జావేద్‌పై ముంబై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఈ వైరల్ వీడియోలో కొందరు మహిళలు పోలీసు దుస్తుల్లో వచ్చి ఓ కేఫ్ వద్ద ఉన్న ఉర్ఫీ జావేద్‌‌ను అరెస్టు చేసినట్టు చూపించారు. కురచ దుస్తులు వేసుకుని వీధుల్లో తిరుగుతున్నట్టు, అరెస్టు చేస్తున్నట్టు వారు చెప్పడం కనిపించింది. 

ఈ వీడియో కలకలం రేపడంతో ముంబై డీసీపీ స్వయంగా స్పందించి ఉర్ఫీని అరెస్టు చేయలేదని ప్రకటించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఉర్ఫీతో పాటూ మరికొందరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ప్రభుత్వ అధికారుల చిహ్నాలను దుర్వినియోగ పరచడం, మోసం తదితర అభియోగాలపై కేసు నమోదు చేశారు. కాగా, గతంలోనూ ఉర్ఫీ చట్ట ఉల్లంఘనలకు పాల్పడింది. బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర చర్యలకు దిగినందుకు గతేడాది డిసెంబర్‌లో అంధేరీ పోలీస్ స్టేషన్‌లో ఉర్ఫీపై కేసు నమోదైంది.
Urfi javed

More Telugu News