jupalli krishnarao: ఆ పోలీసులను బదిలీ చేయండి: ఎన్నికల సంఘానికి జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు

Jupalli Krishna Rao meets EC CEO Vikas Raj
  • కొల్లాపూర్‌లో చాలామంది పోలీసులు దీర్ఘకాలంగా ఒకేచోట ఉన్నారని ఫిర్యాదు
  • అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సీఈవో దృష్టికి తీసుకెళ్లిన జూపల్లి
  • అలాంటి వారిని వెంటనే బదిలీ చేయాలని విజ్ఞప్తి
కొల్లాపూర్‌లో చాలామంది పోలీసులు దీర్ఘకాలంగా ఒకేచోట ఉన్నారని, వారిని వెంటనే బదిలీ చేయాలని మాజీ మంత్రి, కొల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఎన్నికల సంఘాన్ని కోరారు. తన నియోజకవర్గంలో కొంతమంది పోలీసులు అధికార బీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు. అలాంటి వారిని తక్షణం బదిలీ చేయాలని కోరారు. నేడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌ను జూపల్లి కలిశారు.

ఇక్కడ కొంతమంది పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు చెప్పినట్లు నడుచుకుంటున్నారన్నారు. అధికార పార్టీ నేతలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని తాము ఫిర్యాదు చేస్తే, తమ పైనే కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపించడం లేదన్నారు.
jupalli krishnarao
Congress
Telangana Assembly Election

More Telugu News